Upendra: ఆ విషయంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం చేసుకున్న ఉపేంద్ర!

కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు ఉపేంద్ర. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.ఇలా ఉపేంద్ర ఒక నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఒక్కొక్కరు ఒక్కో రికార్డ్ కైవసం చేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కానీ ఏ దర్శకుడు కానీ సాధించలేనటువంటి రికార్డు ఉపేంద్ర సాధించారు.

ఈయన (Upendra) హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో ఓం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, ప్రేమ హీరో హీరోయిన్లుగా నటించారు. ఉపేంద్ర కాలేజీలో చదువుతున్న రోజులలో తయారు చేసుకున్నటువంటి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలా అద్భుతమైన కథతో తెరకెక్కించిన ఈ సినిమా సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా 1995 మే 19 న విడుదలయి కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. అప్పటినుంచి మార్చి 12, 2015 వరుకు ఈ సినిమా ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ అయ్యి రికార్డు సృష్టించింది. సాధారణంగా ఒక సినిమా రెండుసార్లు లేదా మూడుసార్లు తిరిగి విడుదలవుతూ ఉంటుంది కానీ ఈ సినిమా ఏకంగా 550 సార్లు తిరిగి విడుదల కావడం విశేషం.

ఇలా ఈ సినిమా ఇన్నిసార్లు విడుదల కావడంతో ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం చేసుకుంది. ఇలా భారతీయ సినీ చరిత్రలో ఏ హీరో కూడా ఇలాంటి రికార్డు సొంతం చేసుకోలేదని చెప్పాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus