మంచు విష్ణు (Manchu Vishnu) 5 ఏళ్ళు కష్టపడి తీసిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా నిన్న అంటే జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటిరోజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈవెనింగ్ షోలకు ఫుట్ ఫాల్స్ పెరిగాయి. చాలా ఏరియాల్లో నిన్న ఈవెనింగ్ షోలు, నైట్ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ప్రభాస్ (Prabhas) కామియో ఉండటం వల్ల, అలాగే అతని పాత్ర చాలా బాగుండటం వల్ల అభిమానులు ఎంతో ఆసక్తితో థియేటర్లకు వెళ్లారు. అది కూడా ఓపెనింగ్స్ కి ఉపయోగపడినట్లు అయ్యింది.

మొత్తంగా ఈ ఫాక్టర్స్ వల్ల మంచు విష్ణు కెరీర్లో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ‘కన్నప్ప’ (Kannappa) ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
| నైజాం | 2.25 cr | 
| సీడెడ్ | 0.72 cr | 
| ఉత్తరాంధ్ర | 0.75 cr | 
| ఈస్ట్ | 0.45 cr | 
| వెస్ట్ | 0.42 cr | 
| గుంటూరు | 0.40 cr | 
| కృష్ణా | 0.35 cr | 
| నెల్లూరు | 0.38 cr | 
| ఏపీ+తెలంగాణ | 5.72 cr (షేర్) | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.35 cr | 
| ఓవర్సీస్ | 0.80 cr | 
| వరల్డ్ టోటల్ | 7.87 cr (షేర్) | 
‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.87 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.7.87 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.15 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.79.13 కోట్ల షేర్ ను రాబట్టాలి.
