మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ విజయదశమి కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అయ్యింది. మొదటిరోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ కలెక్షన్లు మాత్రం టాక్ కు తగినట్లు రాబట్టలేకపోయింది. టాక్ విషయంలో ‘ఆచార్య’ రిజల్ట్ ను మరిపించిన ‘గాడ్ ఫాదర్’ కలెక్షన్స్ విషయంలో మాత్రం నిరాశపరిచింది. ఈ చిత్రానికి రూ.92 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే నిర్మాతలు మాత్రం ఓన్ రిలీజ్ చేసుకున్నాం.ఇప్పటివరకు రూ.60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది కాబట్టి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అంటూ చెప్పుకుంటున్నారు.
వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల ఇవే మాటలు చెబుతున్నారు. ‘వాళ్ళు చిరు సినిమాని హిట్ అని చెప్పడానికి ఆయన స్థాయిని తగ్గించేస్తున్నారా?’ అనే అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఏదో ఒక రకంగా ‘గాడ్ ఫాదర్’ సినిమాని హిట్ అని చెప్పించాలనే వారి తాపత్రయం కనిపిస్తుంది. మరోపక్క ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్లు రావడం గ్రేట్ అంటారు. ‘ ‘లూసిఫర్’ సినిమాలో హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు..
చిరుతో ఇలాంటి సినిమా చేయడం రిస్క్ అని అయినా చేసి బ్లాక్ బస్టర్ చేసినట్టు కూడా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ‘లూసిఫర్’ అనేది మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీ అన్న సంగతి కూడా మర్చిపోయినట్టు లేదా జనాలకు తెలీదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సరే ఒరిజినల్ గా చూసుకుంటే ‘గాడ్ ఫాదర్’ మూవీ రూ.92 కోట్ల టార్గెట్ కి రూ.55 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో వారం క్రేజీ సినిమాలు ఏవీ లేవు కాబట్టి గట్టిగా క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ కు దగ్గరపడుతుందేమో అనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు.
నిన్న రిలీజ్ అయిన ‘కాంతారా’ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుని తొలిరోజే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది. దీంతో ‘గాడ్ ఫాదర్’ కు పెద్ద దెబ్బ పడినట్టు అయ్యింది. అసలు ఆ డబ్బింగ్ సినిమాలోని నటీనటులు కూడా తెలుగు జనాలకు తెలీదు. అయినా సరే ఈ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద జోరు చూపించడం అంటే మామూలు విషయం కాదు.