కన్నడ సినిమా ‘కాంతార’… బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు చేసిందో చూశాం. కన్నడలో సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడి బాక్సాఫీస్ వద్ద రూ.175 కోట్ల వరకు వసూళ్లను కొల్లగొట్టింది. ఇక అక్టోబర్ 15న ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా అక్కడ కూడా ఈ మూవీ భారీ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.90 కోట్లకు పైగా వసూళ్లను, తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఈ మూవీ.
వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు ఈ మూవీ రూ.365 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తూనే ఉంది ఈ మూవీ. ఇక ‘కాంతారా’ ఓటిటి రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 7,10 రోజుల్లో ‘కాంతార’ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఈ చిత్రం తెలుగు శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కాంతార’ శాటిలైట్ హక్కులను స్టార్ మా వారు దక్కించుకున్నారట. ఈ చిత్రాన్ని వారు రూ.4.5 కోట్ల ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. తొలిసారి టెలికాస్ట్ అయినప్పుడు ‘కాంతార’ మూవీ 10 వరకు టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చెయ్యాలి. థియేటర్లలో లాంగ్ రన్ పడిన సినిమాలకు బుల్లితెర పై ఆశించిన రేంజ్లో టి.ఆర్.పి నమోదు కావడం లేదు అన్న సంగతి తెలిసిందే.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్ ను కొనసాగించిన ‘కాంతార’ బుల్లితెర పై ఎలాంటి అద్భుతం చేస్తుందో చూడాలి. ఇక ‘కె.జి.ఎఫ్'(సిరీస్) నిర్మాతలైన ‘హోంబలే ఫిలింస్’ వారు రూ.16 కోట్ల బడ్జెట్ తో ‘కాంతార’ ని నిర్మించారు. రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దీనికి దర్శకత్వం కూడా వహించడం విశేషం.అడవులు,భూతకోల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది.