Kareena, Priyanka: ప్రియాంకతో గొడవ.. ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన కరీనా!

సినిమా పరిశ్రమలో హీరోయిన్ల మధ్య కోల్డ్‌ వార్‌ ఉంటుంది అంటుంటారు. కొంతమంది హీరోయిన్ల మధ్య జరిగే ఆ సిట్యువేషన్‌ బయటకు రాదు. కొన్ని మాత్రం బయటకు వస్తుంటాయి. అలాంటి ఓ పాత విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అయితే అది జరిగింది ఇక్కడ కాదు, బాలీవుడ్‌లో. ఉత్తరాదిలో కూడా ఇలాంటి గొడవలు గతంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌ మద్య జరిగిన పంచాయితీ ఒకటి.

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్స్‌గా రాణించారు ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్‌. 2004లో బాలీవుడ్‌లో వచ్చిన ‘ఐత్రాజ్‌’ సినిమాలో ఈ ఇద్దరూ కలసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో కరీనా, ప్రియాంక మధ్య చిన్నపాటి గొడవలు వచ్చాయని ఆ రోజుల్లో ప్రచారం సాగింది. నిజానికి ఆ సినిమాకు ముందే ఇద్దరి మధ్య చిన్నపాటి పొరపొచ్చాలు ఉన్నాయని, ఆ సినిమా ముదిరాయి అన్నారు.

కరీనా – ప్రియాంక మధ్య గొడవగా మొదలై ఆ తర్వాత కొట్లాట వరకు దారి తీసిందని అనేవారు. ఈ విషయం మీద ఇన్నాళ్లకు అంటే సుమారు 20 ఏళ్ల తర్వాత కరీనా కపూర్‌ స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా… ప్రియాంకతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని క్లారిటీ ఇచ్చింద. మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయంటూ అప్పట్లో జరిగిన ప్రచారంలో నిజం లేదని చెప్పింది. అయితే అప్పట్లో తమ మధ్య పోటీ ఉండేదన్నారు.

స్టార్‌ హీరోయిన్లుగా ఎదుగుతున్న ఆ సమయంలో బెస్ట్‌గా ఉండేందుకు పరస్పరం పోటీ పడేవాళ్లం తప్ప… తమ మధ్య ఇంకెలాంటి సమస్యలు లేవని చెప్పుకొచ్చింది కరీనా. అయితే అప్పటి జనాలు మాత్రం అది పోటీ మాత్రమే కానీ, అంతకుమించి అని అంటుంటారు. ఏదో సినిమాలో ఛాన్స్‌ విషయంలో జరిగిన చిన్నపాటి చర్చ ఆ తర్వాత వాగ్వాదానికి, ఆ తర్వాత కొట్లాటకు దారి తీసాయని అంటున్నారు. కానీ కరీనా (Kareena) మాత్రం అదేం లేదు అంటోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus