Karthik Varma: అప్పుడు మెగా హీరో.. ఇప్పుడు అక్కినేని హీరో..!
- November 16, 2024 / 09:00 AM ISTByFilmy Focus
సుకుమార్ (Sukumar) శిష్యుడు కార్తీక్ వర్మ దండు అలియాస్ కార్తీక్ దండు (Karthik Varma Dandu).. ‘భమ్ బోలేనాథ్’ (Bham Bolenath) చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి మంచి టాక్ వచ్చింది కానీ.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో అతను దాదాపు 9 ఏళ్ళు గ్యాప్ తీసుకుని.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో ‘విరూపాక్ష’ (Virupaksha) అనే సినిమా చేశాడు. ఇది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.వంద కోట్ల క్లబ్లో కూడా చేరింది.
Karthik Varma

ఆ తర్వాత ఇతను బిజీ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వల్లనే అని చెప్పాలి. అయితే మొత్తానికి ఓ క్రేజీ హీరోని పట్టాడు కార్తీక్. వివరాల్లోకి వెళితే.. అక్కినేని హీరో నాగ చైతన్యతో (Naga Chaitanya) నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు కార్తీక్ దండు. ఈ మధ్యనే ఫైనల్ నేరేషన్ విని.. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాగ చైతన్య. ఇది కూడా ఓ థ్రిల్లర్ కథే అని సమాచారం.

వచ్చే నెల అంటే డిసెంబర్ 11న ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉంది. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) , బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అని తెలుస్తుంది. హైదరాబాద్ తో పాటు రాజస్థాన్, సిమ్లా, అరకు వంటి ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది అని సమాచారం. మరోపక్క నాగ చైతన్య ‘తండేల్’ (Thandel) ప్రాజెక్టు ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న విడుదల కానుంది.













