2014 వ సంవత్సరంలో నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ‘స్వామి రారా’ తో సక్సెస్ కొట్టి ఫామ్లో ఉన్న నిఖిల్ కు.. మరో సక్సెస్ ను అందించింది ఈ చిత్రం. ‘కార్తికేయ’ కి సీక్వెల్ ఉంటుంది అని ఆ టైంలోనే అనౌన్స్ చేశారు. కానీ అది ఆలస్యం అయ్యింది. మొత్తానికి లాక్ డౌన్ టైంలో ఈ చిత్రం షూటింగ్ ను మొదలుపెట్టారు.
ఇక షూటింగ్ కంప్లీట్ కావడంతో జూలై 22న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుండీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది మొదటి ట్రైలర్ అట. ఇంకో ట్రైలర్ కూడా ఉండబోతుంది. ఇక ‘కార్తికేయ’ చిత్రం స్నేక్ హెప్నటైజేషన్ కాన్సెప్ట్ మెయిన్ హైలెట్ గా సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ‘కార్తికేయ2’ చిత్రం కృష్ణుడు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది.
సముద్రం దాచుకున్న ద్వారకా నగరం.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. అయితే ఈ మూవీలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువగానే ఉన్నట్టు ట్రైలర్ లోని విజువల్స్ చెబుతున్నాయి. ఈ ట్రైలర్లో ‘స్నేక్ హెప్నటైజేషన్’ కాన్సెప్ట్ ను ఎక్కువగా చూపించలేదు.ట్రైలర్ చివర్లో చూపించి మమ అనిపించారు.బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ట్రైలర్ లో కూడా ఆయన మెరిశాడు.
ఇక అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆదిత్య మీనన్, రావు రమేష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ చిత్రాన్ని నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!