‘కార్తికేయ 2’ (Karthikeya 2) .. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటింది.’ఉత్తమ తెలుగు చిత్రం’ గా అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా ‘కార్తికేయ 2’ నిర్మాతలు అయిన అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) , టి.జి.విశ్వప్రసాద్(T. G. Vishwa Prasad) , దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) .. ఓ ప్రెస్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి ‘కార్తికేయ 3 (Karthikeya 3) కూడా ఉంటుందని’ తెలిపారు. దీంతో ‘కార్తికేయ 3’ గురించి ఇప్పుడు బోలెడు చర్చలు నడుస్తున్నాయి.
Karthikeya 3
‘కార్తికేయ 2 ‘ చివర్లో ‘కార్తికేయ 3’ (Karthikeya 3) సంబంధించి లీడ్ ఇచ్చారు. కథ కూడా రెడీగా ఉందని చందూ మొండేటి చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం చందూ మొండేటి… నాగ చైతన్యతో (Naga Chaitanya) ‘తండేల్’ (Thandel) సినిమా చేస్తున్నాడు. దీనిని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ నిర్మిస్తోంది. ‘గీతా ఆర్ట్స్’ సంస్థకి, అల్లు అరవింద్ కి (Allu Aravind) చాలా లాయల్ గా వ్యవహరిస్తున్నాడు దర్శకుడు చందూ మొండేటి. ‘కార్తికేయ 2’ రిలీజ్ కి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.వాటిని పరోక్షంగా ‘గీతా ఆర్ట్స్’ సంస్థ పరిష్కరించినట్టు అప్పట్లో టాక్ నడిచింది.
కాబట్టి.. ‘కార్తికేయ 3’ ని ‘గీతా ఆర్ట్స్’ లోనే చేయాలని దర్శకుడు చందూ మొండేటి అనుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే అందుకు ‘పీపుల్ మీడియా’ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అంగీకరిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే ‘పొలిమేర 3’ ప్రాజెక్టుని నిర్మించే పని పెట్టుకుని..ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘గీతా..’ సంస్థ… ‘కార్తికేయ 3’ ని బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు చేయకపోవచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చూడాలి ఏమవుతుందో?