బాలీవుడ్ లో శ్రీలీల.. లవ్ సౌండ్ మామూలుగా లేదు?

టాలీవుడ్ గ్లామర్ డాల్ శ్రీలీల  (Sreeleela)  బాలీవుడ్ ఎంట్రీతో ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో  (Kartik Aaryan) కలిసి ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం కోసం ఇప్పటికే కొన్ని ఫైర్ లవ్ గ్లింప్స్‌ను విడుదల చేసిన మేకర్స్‌కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. వీరి మధ్య కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Kartik Aaryan, Sreeleela:

ఈ సినిమా టైటిల్‌ను ఆషికీ 3గా రిజిస్టర్ చేయాలన్న ప్రయత్నం జరుగుతున్నా, ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. కానీ టైటిల్‌పై అసలు కంటే ఎక్కువగా ఇప్పుడు కార్తీక్ శ్రీలీల జంట మీదే చర్చ నడుస్తోంది. షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడిపోయారనే రూమర్స్ హిందీ బెల్ట్‌లో హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా కార్తీక్ తల్లి వ్యాఖ్యలు.. ‘‘కోడలు డాక్టర్ కావాలి’’ అన్న మాటలు, శ్రీలీల ఎంబీబీఎస్ స్టూడెంట్ కావడం.. అన్నీ కలసి గాసిప్స్‌కు బలం చేకూరుస్తున్నాయి.

ఇటీవల బంగాల్‌లో జరిగిన ఓ సాంగ్ షూటింగ్ సందర్భంగా కార్తీక్, శ్రీలీల బీహైండ్ ద సీన్స్ ఫొటోలు లీక్ అయ్యాయి. బైక్ పై కలిసి కూర్చున్న పిక్స్, శ్రీలీల కార్తీక్‌కి షేడ్ ఇచ్చే విధంగా నిలబడి ఉండటం, కార్తీక్ లవ్ సింబల్ చేయడం వంటి హావభావాలు వారి మధ్య ప్రత్యేకమైన కనెక్షన్ ఉందని చెప్పకనే చెబుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు “ఇది కేవలం కెమిస్ట్రీ కాదు.. బాంధవ్యమే” అని కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. వీరి జంటపై వున్న పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకి భారీగా కలిసొస్తోంది.

ఇటీవల వచ్చిన టీజర్‌కు ట్రెండ్ వచ్చినట్లే, ట్రైలర్, సాంగ్స్ విడుదలైతే మల్టిప్లైడ్ హైప్ రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. బాలీవుడ్ మాస్‌కి శ్రీలీల ఓ ఫ్రెష్ ఫేస్ కావడంతో ఆమె ప్రెజెన్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందన్నది పరిశ్రమ వర్గాల అంచనా. మొత్తానికి బాలీవుడ్‌లో శ్రీలీల జంప్ స్టార్ట్‌తో పాటు, కార్తీక్‌తో కెమిస్ట్రీ ఎఫెక్ట్‌కి స్పీడ్ దక్కింది. ప్రేమ ఉందా లేదా అన్నదానికన్నా, స్క్రీన్ మీద వారి జోడీ మెప్పించాలన్న ఆశతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ జంట మ్యాటర్ ఎంత దూరం వెలుతుందో వేచి చూడాలి.

ఒకే రోజు 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.. కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus