పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కొంటే తిప్పలు తప్పవా ? పవన్ తన నిర్మాతకు డబ్బులు వస్తే చాలా? డిస్ట్రిబ్యూటర్ల సంగతి పట్టించుకోరా? .. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయింది. పవన్ గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ని పోటీ పడి అధిక రేట్లకు డిస్ట్రిబ్యూటర్లు ఏరియా హక్కులు కొని చేతులు కాల్చుకున్నారు. భారీగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని అప్పుడు పవన్ చెప్పినప్పటికీ .. అది అమలు కాలేదని సమాచారం. ఇక కాటమరాయుడు చిత్రాన్ని కూడా ఎక్కువ రేటుకే కొనుగోలు చేశారు. ఈ సినిమాపై మంచి టాక్ నడుస్తున్నప్పటికీ బయ్యర్లకు అసలు రావడం కష్టంగా మారిందని తెలిసింది.
ఓవర్సీస్ లో అయితే 11.5 కోట్లకు కొంటే 7 కోట్లు మాత్రమే వచ్చాయని, దాదాపు నాలుగు కోట్లు అక్కడి బయ్యర్లు నష్టపోయినట్లు బయటికి వచ్చింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు నష్టపోయిన సంగతిని బయటికి చెప్పలేకపోతున్నారు. నిర్మాత శరత్ మరార్, పవన్ కళ్యాణ్ తమ లాభాలను చూసుకొని అధిక రేట్లకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.. తమ గురించి అసలు పట్టించుకోవడంలేదని బయ్యర్లు స్నేహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. దీనిపై జనసేనాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.