టాలీవుడ్‌లో కీర్తి సురేష్ (Keerthy Suresh) కెరీర్ కొంతకాలంగా నెమ్మదిగా సాగుతోంది. ‘మహానటి’తో (Mahanati) వచ్చిన విజయానంతరం ఆమెకు భారీ అవకాశాలు దక్కినా, స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో నిలదొక్కుకునే స్థాయిలో మాత్రం ఆమె ప్రాచుర్యం లేకుండా పోయింది. ‘సర్కారు వారి పాట’లో (Sarkaru Vaari Paata) కీర్తి నటన కుర్రాళ్లను ఆకట్టుకున్నా, ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చే రోల్ గా నిలవలేదు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి (Chiranjeevi) సరసన సోదరి పాత్ర చేయడం ఆమె కెరీర్‌కు ఒక గమ్యాన్ని చూపించింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ పై కీర్తి సురేష్ దృష్టి పెట్టడం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది.
Keerthy Suresh
వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బాలీవుడ్‌కు దారి మళ్లిస్తూ, నేడు అక్కడ భారీ ప్రాజెక్టుల్లో భాగమవుతోంది. ఆమె తాజా బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘బేబిజాన్’కు పారితోషికంగా ఏకంగా 5 కోట్లకు పైగా అందుకుందట. తెలుగులో కేవలం 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న కీర్తి, బాలీవుడ్ లో డబుల్ పారితోషికం అందుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.
ఈ పెళ్లి ఆమె కెరీర్‌కు ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు వచ్చినా, బాలీవుడ్ లో పెళ్లైన నటీమణులకు మంచి మార్కెట్ ఉండటం కీర్తికి ప్లస్ పాయింట్ గా మారింది. ఇక ఆమె బాలీవుడ్ ఎంట్రీకి వెనుక క్రేజ్‌ను ఎన్‌క్యాష్ చేసుకునే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగులో నిర్మాతలు ఇచ్చిన పారితోషికంపై సంతృప్తిగానే ఉన్న అమ్మడు పెద్ద ప్రాజెక్ట్ కోసం ఎక్కువగా డిమాండ్ చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం మార్కెట్‌ను చక్కగా వినియోగించుకుంటోంది.
ప్రస్తుతానికి ఆమె బాలీవుడ్ లో ప్రతి ప్రాజెక్ట్‌కు 5-6 కోట్ల వరకు అందుకుంటుండటం విశేషం. మొన్నటి వరకు తెలుగులో 2 కోట్ల కంటే తక్కువే వచ్చాయి. ఈ వ్యూహంతో ఆమె బాలీవుడ్ లో తన కెరీర్‌ను మరింత మెరుగుపరచుకోనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సరైన హిట్స్ లేకపోయినా, బాలీవుడ్ లో ఆమెకు భారీ రెమ్యునరేషన్‌తో పాటు మంచి గుర్తింపు లభించడం ఆశ్చర్యంగా మారింది. మరి అమ్మడు అక్కడ ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.