స్టార్ హీరోయిన్ దిశగా కీర్తి సురేశ్
- November 17, 2016 / 09:57 AM ISTByFilmy Focus
తెలుగులో మొదటిగా సంతకం చేసిన నటించిన సినిమా విడుదల కాలేదన్న మాటేగానీ ఇంకేలోటూ లేదు కీర్తి సురేష్ కెరీర్ లో. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగువారికి పరిచయమైనా ఈ మలయాళీ ముద్దుగుమ్మ కాబోయే స్టార్ హీరోయిన్ అని యావత్ సినీ పరిశ్రమ నినదిస్తోంది. తెలుగులో ఇప్పటికి చేసింది ఒక్కటంటే ఒకే సినిమా అయినా అగ్ర హీరోల సరసన అవకాశాలు పట్టేస్తున్న ఈ ఇరవై నాలుగేళ్ల భామామణి అటు కోలీవుడ్ లోనూ క్రేజీ హీరోల సినిమాలు చేస్తూ తన స్థాయిని పెంచుకుంటోంది.
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమాలో కీర్తి సురేష్ ఎంపికైంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం త్రినాథరావు తెరకెక్కిస్తున్న ‘నేను లోకల్’ సినిమాలో నానికి జంటగా నటిస్తున్న కీర్తి రెండు సినిమాలతోనే పవన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకుడిగా మహేశ్ చేయనున్న సినిమాలోనూ హీరోయిన్ పాత్రకు కీర్తినే ఖాయం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపైనా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ‘భైరవ’, సూర్య హీరోగా రూపొందనున్న ‘తానా సెరిందా కూట్టమ్’ సినిమాల్లోనూ కీర్తినే కథానాయిక.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















