Keerthy Suresh: అల్లుడితో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన కీర్తి సురేష్ తల్లి..!

‘చమ్కీల అంగీలేసీ ఓ వదినే’.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడవిన్నా ఇదే పాట.. యూత్ చార్ట్ బస్టర్‌గా నిలవడమే కాక.. అందరి మొబైల్స్‌లోనూ ఈ సూపర్ హిట్ సాంగే వినిపిస్తుంది.. సంతోష్ నారాయణన్ ట్యూన్, కాసర్ల శ్యామ్ లిరిక్స్, ధీ, రామ్ మిర్యాల వాయిస్ పాటకు ప్లస్ అయ్యాయి.. ఇక లిరికల్ వీడియోలో కీర్తి సురేష్ అయితే ఫిదా చేసేసింది.. ఈ పాటకి ప్రేక్షకులు థియేటర్లలో రచ్చ రంబోలా చేయడం ఖాయం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్థాయిలో ‘దసరా’ మూవీతో పెద్ద అటెంప్ట్ చేస్తున్నాడు.. మూవీ రిజల్ట్ మీద నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచేశాయి.. ‘నేను లోకల్’ తర్వాత నాని – కీర్తి కలిసి నటిస్తున్నారు.. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘దసరా’..

దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో, పాపులర్ మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.. మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.. ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్) పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయంటూ గట్టిగా చెప్పుకొస్తున్నారు.. ఇక ‘చమ్కీల అంగీలేసి’ పాటకు కీర్తి సురేష్ తల్లి, ఒకప్పటి కథానాయిక మేనక డ్యాన్స్ చేశారు..

కూతురిలా (Keerthy Suresh) కాకపోయినా కానీ తమిళ్ వెర్షన్ సాంగ్‌కి తన స్టైల్లో సింపుల్ స్టెప్పులతో అదరగొట్టేశారామె.. మేనకతో పాటు ఆమె అల్లుడు (కీర్తి అక్క భర్త) కూడా కాలు కదిపాడు.. లుంగీ కట్టి, మందు బాటిల్ చేతబట్టి మాస్ లుక్‌లో, అత్తగారితో కలిసి మూమెంట్స్ చేశాడు కీర్తి బావ.. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.. ‘వావ్ ఆంటీ సూపర్’ అంటూ కీర్తి ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus