స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇప్పటి వరకు ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. మహానటి (Mahanati) తర్వాత ఆమె కెరీర్ మరింత వైవిధ్యంగా మారింది. అయితే, కమర్షియల్ మాస్ సినిమాల్లో, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌లో కీర్తి బాగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమె కొత్త కోణాన్ని ఎక్స్‌ప్లోర్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు, బాలీవుడ్‌లో కీర్తి పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించనుందనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో ‘నేను శైలజ (Nenu Sailaja)’, ‘రంగ్‌దే’ (Rang De) వంటి సినిమాల్లో లవబుల్ పాత్రలు పోషించిన కీర్తి, బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఆ జానర్‌లో కనిపించలేదు.
ఇప్పుడు ఈ కొత్త చిత్రం ఆమెకు ఆ గ్యాప్‌ను ఫిల్ చేసేలా ఉంటుందని అంటున్నారు. ఇది పూర్తిగా ఫన్ అండ్ లైట్‌హార్టెడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం కథ, ఇతర నటీనటుల వివరాలు బయటకు రాలేదు కానీ, ఇది కీర్తికి బాలీవుడ్‌లో స్థిరమైన గుర్తింపు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇటీవల, ‘బేబీ జాన్’ (Baby John) మూవీ అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ, కీర్తి హిందీలో మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టింది.
‘అక్క’ అనే సినిమా సౌత్ ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండగా, మరో కొత్త ప్రాజెక్ట్ పూర్తిగా రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. గతంలో కీర్తి ఎప్పుడూ చూడని విధంగా ఇందులో గ్లామరస్ రోల్‌లో కనిపించనున్నట్లు బాలీవుడ్ టాక్. కీర్తి ఈ సినిమాతో తన ఇమేజ్‌లో మార్పు తీసుకురావాలనుకుంటుందా లేక బాలీవుడ్ మార్కెట్‌లో రొమాంటిక్ జోనర్‌లోనూ సక్సెస్ అవ్వాలని ప్లాన్ చేసిందా అన్నది చూడాలి.
ఇప్పటికే ఆమెకు తెలుగులో, తమిళంలో మంచి క్రేజ్ ఉండగా, ఇప్పుడు హిందీ పరిశ్రమలోనూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి, ఈ కొత్త ప్రయోగం కీర్తికి ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో వేచి చూడాలి. బాలీవుడ్‌లో ప్రస్తుతం అనన్య పాండే (Ananya Panday), సారా అలీఖాన్ (Sara Ali Khan) లాంటి యంగ్ హీరోయిన్స్ డామినేట్ చేస్తున్న వేళ, కీర్తి తన పర్ఫార్మెన్స్, అందంతో ఈ లిస్టులో నిలిచేలా చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.