వామ్మో.. నితిన్ కీర్తితో తినిపించేసాడుగా..!

  • March 19, 2021 / 08:39 PM IST

ఈ మధ్య కాలంలో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో కొన్ని సినిమాలు మాత్రమే అంచనాలను పెంచుతున్నాయి. అలా రిలీజ్ కు ముందే అంచనాలు పెంచుతున్న సినిమాలలో రంగ్ దే ఒకటి. నితిన్, కీర్తి సురేష్ జంటగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా 37.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచాలనే ఉద్దేశంతో నితిన్, కీర్తి సురేష్ ఈ సినిమాకు డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.

తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో నితిన్ పిజ్జాతో ఊరించగా కంట్రోల్ చేసుకోలేకపోయిన కీర్తి చివరకు పిజ్జా తినేశారు. స్టార్ హీరోయిన్లు సినిమాల్లో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో హీరోయిన్లు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. కీర్తి కూడా డైట్ లో భాగంగా ఫ్రూట్స్ తింటుండగా నితిన్ పిజ్జాతో ఊరించారు. అయితే మొదట పిజ్జా తిననని మొండిగా వ్యవహరించిన కీర్తి సురేష్ ఆ తరువాత మాత్రం నోట్లో నీళ్లు ఊరడంతో పిజ్జా తినేశారు.

కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. రంగ్ దే ప్రమోషన్స్ లో భాగంగానే కీర్తి సురేష్ వీడియోలను షేర్ చేస్తూ సినిమాపై హైప్ ను మరింతగా పెంచుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన రంగ్ దే సినిమాలోని రెండు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నెల 26న విడుదల కాబోతున్న రంగ్ దే హీరో నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus