Keerthy Suresh: ఆ కారణంతోనే మహానటి సినిమాకు నో చెప్పాను!

  • March 24, 2023 / 06:24 PM IST

వెండితెర నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు. ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు.నాని సరసన నటించిన దసరా సినిమా ఈనెల 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం చిత్రబంధం ముంబైలో సందడి చేస్తున్నారు.

ఇక దసరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ముంబైలో మీడియాతో మాట్లాడినటువంటి కీర్తి సురేష్ మహానటి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటి కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించారు.ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి గొప్ప నటి జీవిత చరిత్రలో నటించాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి. అయితే ఆమె పాత్రలో నటించాలంటే తనకు చాలా భయం వేసిందని తెలిపారు.

ఇలా తన పాత్రలో నటిస్తూ సావిత్రమ్మ గారి అభిమానులను ఆకట్టుకుంటానా లేదా అనే భయం తనలో కలిగిందని అందుకే ఈ సినిమాకు మొదట్లో నో అని సమాధానం చెప్పానని కీర్తి సురేష్ వెల్లడించారు.అయితే ఈ సినిమా విడుదలయి ఎంతో మంచి విజయాన్ని అందుకోవడం తనకు ఎప్పటికీ మర్చిపోలేని విషయమని తెలియజేశారు.మహానటి సినిమాలోని సావిత్రి పాత్రకు తాను ఒప్పుకున్నానని తెలియడంతో చాలామంది తనని ట్రోల్ చేశారని కీర్తి సురేష్ వెల్లడించారు.

ఇలా తనని ట్రోల్ చేయడంతోనే తాను మొదట్లో ఈ సినిమాకు నో చెప్పానని అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా మీరు చేయగలరు మీకే సాధ్యమవుతుంది అంటూ ఆయన నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఇలా ఆయన ప్రోత్సాహంతోనే తాను ఈ సినిమాలో నటించానని తెలిపారు. ఈ సినిమాలో నటించిన తర్వాత కీర్తి సురేష్ జీవితం మహానటికి ముందు తర్వాత అనే విధంగా మారిపోయింది. ఇక ఈ సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటి అవార్డును కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus