మొన్నటివరకు కీర్తి సురేష్ (Keerthy Suresh) అంటే కేవలం క్యూట్ రోల్స్ మాత్రమే గుర్తొచ్చేవి. కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలో కేవలం ఆ తరహా క్యూట్ రోల్స్ మాత్రమే చేసింది అమ్మడు. “మహానటి” (Mahanati) తర్వాత కీర్తి సురేష్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత నుండి పెర్ఫార్మెన్స్ రోల్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అయితే.. ఓటీటీలో విడుదలైన “చిన్ని” మినహా మరో సినిమా ఏదీ ఆమె నటనను ఎలివేట్ చేయలేకపోయింది. రీసెంట్ గా “బేబీ జాన్”(Baby John) తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ..
AKKA
రీమేక్ సినిమా కావడంతో హిట్ స్టేటస్ అందుకోలేక చతికిలపడింది. అయితే.. ఇవాళ “NEW ON NETFLIX” ఈవెంట్ లో భాగంగా విడుదల చేసిన “అక్క” (AKKA) అనే వెబ్ ఫిలిం టీజర్ కీర్తి సురేష్ లోని మరో యాంగిల్ ను పరిచయం చేసింది. పేర్నూరు అనే ఫిక్షనల్ ప్లేస్ కు చెందిన లేడీ డాన్ గా ఈ “అక్క” వెబ్ ఫిలింలో కనిపించనుంది కీర్తి సురేష్.
మగాళ్ల మధ్య శివంగిలా కనిపిస్తున్న కీర్తి సురేష్ స్క్రీన్ ప్రెజన్స్ టీజర్ కి హైలైట్ అని చెప్పాలి. ఆమెతోపాటు బోలెడు మంది స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ.. రాధిక ఆప్టే (Radhika Apte) ఒక్కర్తే ప్రస్తుతానికి ఎలివేట్ అయ్యింది. పెళ్ళాయక కీర్తి సురేష్ సినిమాలకి స్వస్తి చెబుతుందేమో అనుకున్నవాళ్లందరికీ.. ఈ టీజర్ తో సమాధానం దొరికినట్లే. ముఖ్యంగా కీర్తి సురేష్ కి బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ రావడం కూడా ఖాయం అని ఈ టీజర్ కన్ఫర్మ్ చేసింది.
ఇకపోతే.. ఈ “అక్క” ఎప్పడు స్ట్రీమ్ అవుతుంది అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు కానీ, ఎప్పడు విడుదలైనా సంచలనం సృష్టించడం అయితే ఖాయం. పవర్ ఫుల్ గా కనిపిస్తున్న ఈ టీజర్ తర్వాత వచ్చే కంటెంట్ లో బోల్డ్ సీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయని వినికిడి.