Keerthy Suresh: శర్వానంద్ కి జోడీగా స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్న ఈ హీరోకి ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా ఫ్లాప్ మీద ఫ్లాప్ పడుతూనే ఉంది. రీసెంట్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో శర్వానంద్ డీలా పడిపోయాడు. తన తదుపరి సినిమాతోనైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Click Here To Watch NOW

నితిన్ హీరోగా ‘ఛల్ మోహన్ రంగ’ అనే సినిమాను రూపొందించిన దర్శకుడు కృష్ణ చైతన్య.. శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. చర్చలు మొత్తం పూర్తయ్యాయి. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. సినిమాలో శర్వానంద్ కి ఓ బిడ్డ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా ముందుగా కృతి శెట్టిని తీసుకోవాలనుకున్నారు. ఆమెని సంప్రదించగా.. కెరీర్ బిగినింగ్ లోనే తల్లి పాత్రలు చేయడం కరెక్ట్ కాదనుకొని నో చెప్పింది.

దీంతో దర్శకనిర్మాతలు కీర్తి సురేష్ ను సంప్రదించారు. ఇదివరకు ఆమె ‘పెంగ్విన్’ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా నటించింది. ఇప్పుడు మరోసారి శర్వానంద్ సినిమాలో అలాంటి పాత్ర పోషించబోతుందని సమాచారం. కీర్తి సురేష్ కి వరుస ఫ్లాప్ లు పడుతున్నప్పటికీ అవకాశాలకు మాత్రం కొదవ లేదు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారు పాట’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో హీరో సిస్టర్ రోల్ లో కనిపించబోతుంది. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇప్పుడు శర్వానంద్ సినిమాలో కూడా నటించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలతోనైనా.. అమ్మడు హిట్ అందుకుంటుందేమో చూడాలి!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus