‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘బాహుబలి'(సిరీస్) తర్వాత పాన్ ఇండియా లెవెల్లో చరిత్ర సృష్టించిన సినిమాగా ‘కె.జి.ఎఫ్ 2’ నిలిచింది. ప్రశాంత్ నీల్ టేకింగ్ కు యష్ మాస్ పెర్ఫార్మెన్స్ తోడై సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ఈ మూవీలో రాఖీ బాయ్ పాత్రకి మాత్రమే కాదు అన్ని పాత్రలకి మంచి స్కోప్ ఉంటుంది. ముంబై డాన్ శెట్టి, సూర్య వర్ధన్, చాచా. ఇనాయత్ ఖలీల్ ఇలా ప్రతీది కూడా ప్రాముఖ్యమైన పాత్రే. అయితే ఆండ్రూ రోల్ గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం.
ఈయన సినిమాల్లో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూనే కనిపిస్తాడు. ఈ పాత్రని పోషించింది బి.ఎస్.అవినాష్. ఈయన చదువుకునే రోజుల నుండీ నటుడు అవ్వాలని ఆశపడేవాడు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా అది కుదర్లేదు. ఈయనకి నటన పై ఉన్న వ్యామోహం చిరంజీవి షార్జాని కలిసేలా చేసాయి. ఇతనిలో నటుణ్ని గుర్తించిన ఆయన నటనకి సంబంధించిన కోర్సు చేయమని చెప్పారు. కోర్స్ ఫినిష్ చేసి ఆడిషన్స్ ఇస్తున్న టైములో ఈయనకి ‘కె.జి.ఎఫ్’ లో అవకాశం దక్కింది. ఇక తర్వాతి సంగతి మీకు తెలిసిందే. ఈయన ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్. ఈయన బాడీ అలాగే జిమ్ లో చేసే వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే. కావాలంటే చూడండి :