KGF2: కేజీఎఫ్2 మేకర్స్ ఆ ఆఫర్ కు నో చెప్పారా?

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో కేజీఎఫ్ ఛాప్టర్2 ఒకటనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల్లో కేజీఎఫ్2 ఒకటి కాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాకు ఏకంగా 250 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందని థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీకి ఇవ్వాలని ఆ సంస్థ కోరిందని సమాచారం. మేకర్స్ ఈ ఆఫర్ కు నిర్మొహమాటంగా నో చెప్పినట్టు తెలుస్తోంది. హోంబలే పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ప్రకాష్ రాజ్, సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్2 సినిమా సరైన సమయంలో విడుదలైతే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు గ్యారంటీగా వస్తాయి.

కరోనా సమయంలో థియేట్రికల్ రిలీజ్ రిస్క్ అయినప్పటికీ సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మొదట ఈ సినిమా రిలీజ్ కానుండగా పరిస్థితులను బట్టి నార్త్ లో రిలీజ్ కానుందని సమాచారం. హీరో యష్ సైతం కష్టమైనా థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus