టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రత్యేకమైన సినిమాలలో ఖడ్గం (Khadgam) సినిమా ఒకటి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సమయాలలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ లో ఈ సినిమా కచ్చితంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా వల్ల చాలామంది కృష్ణవంశీ (Krishna Vamsi) డైరెక్షన్ కు ఫ్యాన్స్ గా మారారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ నెల 2వ తేదీన ఖడ్గం మూవీ రీరిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజైన సమయానికి ఇప్పటికీ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి.
అందువల్ల ఒరిజినల్ వెర్షన్ నే థియేటర్లలో ప్రదర్శిస్తారా? లేక బుల్లితెరపై మ్యూట్లతో ఉండే వెర్షన్ ను ప్రదర్శిస్తారా అనే చర్చ జరుగుతుంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ విషయంలో అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఖడ్గం సినిమాకు రీరిలీజ్ లో సైతం అదిరిపోయే రెస్పాన్స్ రావడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రవితేజకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ సైతం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
ఖడ్గం రీరిలీజ్ లో కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో అదరగొడుతుందో చూడాల్సి ఉంది. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన మురారి మూవీ రీరిలీజ్ లో హిట్ గా నిలవడం గమనార్హం. ఖడ్గం సినిమా ఎన్ని థియేటర్లలో రీరిలీజ్ అవుతుందో చూడాలి. దేవర సినిమా రిలీజ్ తర్వాత ఖడ్గం రీరిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాల్సి ఉంది.
గాంధీ జయంతి సెలవు రోజు కావడం ఖడ్గం మూవీకి మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఖడ్గం సినిమాకు రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తే మరిన్ని హిట్ సినిమాల రీరిలీజ్ దిశగా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉంది.