Khushbu: సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ వింటేజ్ గ్లామర్ పిక్స్ వైరల్..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ ఇప్పటికీ సహాయ నటి పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.ఓ పక్క రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న ఈ ముంబై బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఒకానొక సమయంలో ఈమెకు గుడి కట్టారు అంటే ఈమె అప్పటి కుర్రకారుని తన గ్లామర్ తో ఏ స్థాయిలో అలరించి కలల రాకుమారిగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

1986 లో కె.రాఘవేంద్ర రావు గారు వెంకటేష్ ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్ట్ చేసిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.అందమైన భామలను టాలీవుడ్ కు హీరోయిన్లుగా పరిచయం చేయడం కె.రాఘవేంద్ర రావు గారి తర్వాతే ఎవ్వరైనా..! అటు తర్వాత ‘కెప్టెన్ నాగార్జున’ ‘త్రిమూర్తులు’ ‘భారతంలో అర్జునుడు’ ‘కిరాయి దాదా’ ‘మారణ హోమం’ ‘చిన్నోడు పెద్దోడు’ ‘శాంతి క్రాంతి’ ‘పేకాట పాపారావు’ ‘స్టాలిన్’ ‘యమదొంగ’ ‘కథానాయకుడు’ ‘అజ్ఞాతవాసి’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది మెప్పించింది.

ఇటీవల కుష్బూ సన్నబడి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈరోజు కుష్బూ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. 1970 సెప్టెంబర్ 29న జన్మించిన కుష్బూకి ఇది 51వ పుట్టినరోజు. ఇదిలా ఉండగా.. ఈమె వింటేజ్ గ్లామర్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె గ్లామర్ చూస్తే ఇప్పటి కుర్రకారు కూడా గుడి కట్టేయడం ఖాయమనే చెప్పాలి. ఓసారి ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus