కియారా అద్వానీ (Kiara Advani) అందరికీ సుపరిచితమే. మహేష్ బాబు (Mahesh Babu) ‘ భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – కియారా కలిసి ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) అనే సినిమా ఆల్రెడీ చేయడంతో వీరి పెయిర్ చాలా బావుంటుంది అని ఓ నమ్మకం. దాంతోనే ఆ సినిమా డిజాస్టర్ అయినా ఈ జంటకు మంచి పేరు వచ్చింది. అందుకే శంకర్ (Shankar) సైతం ఈ జోడిని గేమ్ చేంజర్ (Game Changer) కోసం ఏరికోరి ఎంచుకున్నాడు.
ఇక దర్శకుడు శంకర్ గురించి అందరికీ తెలిసిందే. తన హీరోయిన్లను అందంగా, హృద్యంగా తెరపై చూపించడానికి కోట్ల కొలదీ ఖర్చు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్‌లో కూడా నటి కియారాను శంకర్ అద్భుతంగా చూపించాడని ఇప్పటి వరకు వచ్చిన పాటలే చెబుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే… సదరు సినిమాలో ఆమెకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ కియారా అద్వానీ మాత్రం గేమ్ చేంజర్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నట్టు కనబడుతోంది.
అయితే ఇతర సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వలన రావడం లేదా? లేదంటే టీంతో ఏదైనా సమస్యలు ఉన్నాయా? అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. లక్నోలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాత్రమే కియారా ఓ మెరుపులా కనిపించి, ఆ తరువాత మరలా ఎక్కడా కనిపించలేదు. డల్లాస్ ఈవెంట్‌కు వెళ్లలేదు.. అదేవిధంగా నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా అమ్మడు కనిపించలేదు.
ఈ క్రమంలోనే రేపు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అయినా కియారా వస్తుందా? లేదా? అని మెగాభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా ఈవెంట్‌ను రాజమండ్రిలో దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ముఖ్య అతిథిగా రాబోతోన్నట్టు సమాచారం జరుగుతోంది. దీంతో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చరిత్రను సృష్టించేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.
మరోవైపు గేమ్ చేంజర్ ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. శంకర్ కమ్ బ్యాక్‌లా ఈ మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అవుతున్నారు. గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్, యాక్టింగ్, ట్విస్టులు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని మేకర్లు చెబుతున్నారు. మరి జనవరి 10న గేమ్ చేంజర్‌కు ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడాలి మరి!