విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన భారీ స్పై యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్’ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా మేకింగ్ నుంచి ప్రతి విషయంలోనూ నిర్మాత నాగవంశీ ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం, ఈ చిత్రాన్ని ఏకంగా రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్ డీటెయిల్స్ కొన్ని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.ముందుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ… ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా, లాభాల్లో వాటాతో కలిపి ఏకంగా రూ.30 కోట్ల అతని ఖాతాలో చేరనున్నాయని సమాచారం. ఈ డీల్ చూస్తుంటే, వరుస పరాజయాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై విజయ్‌కు ఏ స్థాయిలో నమ్మకం ఉందోఅర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కూడా భారీ మొత్తాన్ని అందుకుంటున్నాడు. తన మ్యూజిక్‌తో సినిమా స్థాయిని పెంచేస్తున్న అనిరుధ్‌కు ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా కోటి రూపాయలు పారితోషికం అందుకున్నట్టు టాక్. అలాగే అత్యంత కీలక పాత్ర పోషించిన హీరో సత్యదేవ్‌కు రూ.3 కోట్లు ముట్టజెప్పారట. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూ.7 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. 2 ఏళ్ళ పాటు సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కు కూడా నెలకు రూ.50 వేల చొప్పున జీతాలు ఇచ్చారట. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ వంటి వాళ్ళ పారితోషికాల రూపంలో కూడా కోట్లు ఖర్చు అయినట్టు తెలుస్తోంది.