జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ ఆ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. తర్వాత రోజుల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఆర్పీ కర్రీ పాయింట్ బిజినెస్ ను మొదలుపెట్టగా తర్వాత రోజుల్లో ఇతర ఏరియాలలో బ్రాంచ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొంతమంది చేస్తున్న కామెంట్ల గురించి ఆర్పీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇది నా వ్యాపారం అని నా రేట్లు ఇంతేనని ఆయన తెలిపారు. కారును కొనుగోలు చేసేవాళ్లు ఎవడి స్థోమతను బట్టి వాళ్లు తీసుకుంటారని ఆర్పీ చెప్పుకొచ్చారు. నా దగ్గర ఉండే వంటకాలను సైతం కొనగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లే కొంటారని ఆయన కామెంట్లు చేశారు. తక్కువ రేటు అని చెప్పి ఎలా పడితే అలా ఇవ్వలేనని ఆర్పీ పేర్కొన్నారు. వంటకాల కోసం మేము క్వాలిటీ ఉత్పత్తులనే వాడతామని ఆయన చెప్పుకొచ్చారు.
నా చేపల పులుసు నీకు అందుబాటు రేటులో ఉంటే తినాలని లేకపోతే వద్దని (Kiraak RP) ఆర్పీ చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలని నా ఫుడ్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారని కిర్రాక్ ఆర్పీ అన్నారు. 100 రూపాయలు జేబులో పెట్టుకుని 1000 రూపాయల ఫుడ్ కావాలంటే వస్తుందా అని ఆయన కామెంట్లు చేశారు. మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బ్రతిమలాడనని ఆయన కామెంట్లు చేశారు.
నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని రేట్లు ఎంత పెట్టాలనే విషయం నాకు తెలుసని కిర్రాక్ ఆర్పీ వెల్లడించారు. నా చేపల పులుసుపై నాకు నమ్మకముందని ఎవరెన్ని చేసినా ఐ డోంట్ కేర్ అని కిర్రాక్ ఆర్పీ తెలిపారు. కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆర్పీ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.