కిరణ్ అబ్బవరం నుండి ‘K-Ramp’ అనే ఓ కొత్త సినిమా రాబోతోంది. ఇటీవల గ్లిమ్ప్స్, టీజర్ వంటివి వచ్చాయి. దీపావళి సందర్భాంగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈరోజు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టీం అంతా హాజరయ్యింది. మేకర్స్ ఇచ్చిన స్పీచ్..లలో ‘సినిమా సూపర్.. సినిమా బంపర్’ అంటూ యధావిధిగా చెప్పుకొచ్చారు.
చివరిగా కిరణ్ అబ్బవరం స్పీచ్ ఇచ్చాడు. అతని స్పీచ్ లో భాగంగా.. ఓ సందర్భంలో మహేష్ బాబు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు. మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు’ అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్.. మా డైరెక్టర్ మహేష్ బాబు ఫ్యాన్..! వాళ్ళు కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు. కానీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. వాళ్ళది సూపర్ కాంబినేషన్. నేను మా డైరెక్టర్ కూడా అంతే’ అంటూ చెప్పాడు కిరణ్. సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్దాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వీళ్ళ పంచాయితీ ఒకసారి అయితే నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
ఫ్యాన్స్ సంగతి ఎలా ఉన్నా.. ‘మహేష్ తో నాకు మంచి స్నేహం ఉంది’ అని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మహేష్ బాబు సైతం ‘వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం’ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రతి పుట్టినరోజుకి మహేష్ బాబు విషెస్ చెబుతూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటాడు.