యువ హీరో కిరణ్ అబ్బావరం (Kiran Abbavaram) జీవితంలో మరో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నాడు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అతని ఇంట్లోకి తొలి బిడ్డ అడుగు పెట్టినట్లు ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు. ఈ హ్యాపీ న్యూస్‌ను కిరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, బాబుని పాదాలకు ముద్దిచ్చే ఫోటోను పోస్ట్ చేశారు. “Blessed with a Baby Boy” అంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెబుతూ అభిమానులతో ఈ సంతోషాన్ని పంచుకున్నారు.
కిరణ్, రహస్యా ప్రేమ కథ 2019లో వచ్చిన తొలి సినిమా ‘రాజా వారు రాణి గారు’ సెట్స్‌లో మొదలైంది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా వీరిద్దరిని కొత్త జంటగా గుర్తించించింది. ఆ అనుబంధం ఐదేళ్ల ప్రేమగా మారి, 2024 ఆగస్టులో వివాహ బంధంతో మరింత దగ్గరైంది. ఇప్పుడు వారి జీవితం మరో మెరుగైన దశలోకి అడుగుపెట్టింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం.
ఈ మధురమైన సంతోషానికి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా కిరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కిరణ్ ప్రస్తుతం మాస్ ఎంటర్టైనర్ ‘K రాంప్’ సినిమాతో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన ‘దిల్‌రుబా’ తర్వాత ఆయన ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఇక రహస్యా కూడా తన భవిష్యత్ సినిమాలకు విరామం తీసుకుని ఈ కొత్త దశను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట జీవితం పూర్తిగా చిన్నారి చుట్టూనే తిరుగుతోంది. హనుమాన్ జయంతి రోజున పుట్టిన పాపాయికి మంచి పేరు పెట్టండి అంటూ సలహాలు ఇస్తున్నారు.
Blessed with a Baby Boy
Happy Hanuman Jayanthi #Jaisreeram pic.twitter.com/UG5Ztky8gd
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) May 22, 2025