Kiran Abbavaram: నన్ను ఇండస్ట్రీ నుండి పంపించేయాలని చూస్తున్నారు

‘రాజావారు రాణివారు’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’, ‘సమ్మతమే’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రానికి కథ అందించింది కూడా కిరణ్ అబ్బవరం కావడం విశేషం.ఇలా హీరోగానే కాకుండా రైటర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ‘సెబాస్టియన్’ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ కిరణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. త్వరలో ఇతను ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈరోజు టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 2 నిమిషాల నిడివి గల ఈ టీజర్లో అన్ని జోనర్లు కనిపిస్తున్నాయి. సినిమా పై అంచనాలు పెంచే విధంగానే ఈ ట్రైలర్ ఉంది. ఇక ఫిబ్రవరి 17న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం టీజర్ లాంచ్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అతను మాట్లాడుతూ.. ‘నేను ఇంకా స్టార్ హీరో కాలేదు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాను. కానీ నా మీద ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను రెస్పాండ్ అవ్వకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. ఇదంతా కావాలనే చేస్తున్నారు. నన్ను మూవీ ఇండస్ట్రీ నుండి పంపించేద్దామని అనుకుంటున్నారేమో? ఒక సినిమా టైటిల్ కార్డ్స్ లో నేను వేసుకోకపోయినా… పవర్ స్టార్ అనే ట్యాగ్ ను ఎడిట్ చేసి మీమ్స్ వేశారు.

ఆ ట్యాగ్ నిజంగానే నేను వేసుకున్నాను అనుకుని చాలా మంది దారుణంగా ట్రోల్ చేశారు. దాన్ని చాలా మంది నమ్మేసి ఎందుకు…. ఏంటి? ఇలా ఎందుకు చేస్తున్నావంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు‘ అంటూ కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశాడు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus