సినిమా ఇండస్ట్రీలో స్ట్రాటజీ చాలా ముఖ్యం. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, మార్కెట్‌ని అర్థం చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. ఇదే విషయాన్ని తాజా విజయంతో మరోసారి నిరూపించుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ‘క’ (KA) సినిమా అతనికి ఊహించని బ్రేక్ ఇచ్చింది. అయితే, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పుకోవచ్చు. నిజానికి ‘దిల్ రూబా’ (Dilruba) సినిమా ‘క’ కంటే ముందే పూర్తయింది. కానీ కిరణ్ ఆ సినిమా మీద అంత నమ్మకం లేకుండా, ముందుగా ‘క’ని రిలీజ్ చేశాడు.
తన మార్కెట్‌ను బలంగా నిలబెట్టుకునే సినిమా ఏదైనా ఉంటే అదే ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్కెచ్ ఫలితంగా ‘క’ సాలిడ్ హిట్‌గా నిలిచింది. 20 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇదే ఆర్డర్ రివర్స్ అయ్యి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే, ‘దిల్ రూబా’ ముందు వచ్చి ఫ్లాప్ అయితే, ‘క’కి వచ్చిన బజ్ కూడా తగ్గిపోయేదే. కిరణ్ అబ్బవరం చాలా తెలివిగా ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు.
తన గత ఫెయిల్యూర్స్‌ను పక్కన పెట్టి, మళ్లీ మార్కెట్‌ను అందిపుచ్చుకునేలా ఒక పక్కా గేమ్ ప్లాన్ చేశాడు. ఇక, ఈ గేమ్ ప్లాన్ వల్ల అతనికి ఏమి లాభమంటే.. ఒకవేళ ‘క’ విజయవంతం కాకుండా ఉంటే, నిర్మాతలు ‘దిల్ రూబా’ రిలీజ్‌ను కూడా పక్కన పెట్టేవాళ్లు. కానీ ‘క’ హిట్ కావడంతోనే ‘దిల్ రూబా’కి ఓ మోస్తరు వసూళ్లు దక్కాయి. నాన్ థియేట్రికల్ డీల్స్ తో గిట్టుబాటు అయ్యింది.
ఇక ఈ లైన్‌ను కొనసాగించాలంటే, కిరణ్ ఇలాంటి ప్రయోగాలను కాకుండా, మార్కెట్‌కు తగ్గ కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విజయంతో అతను ఇప్పుడు మరో డిఫరెంట్ స్క్రిప్ట్‌ని ఎంచుకునే దిశగా ఉన్నాడు. సరైన ప్లానింగ్ ఉంటే, హిట్లు వరుసగా కొట్టొచ్చని అతనికి అర్థమైపోయింది. ఇకపై కూడా అదే బిజినెస్ సెన్స్‌తో సినిమాలు చేస్తే, కిరణ్ అబ్బవరం లాంగ్ రన్‌లో స్ట్రాంగ్ పొజిషన్‌లో నిలబడడం ఖాయం.