మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇది అతని అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమా కోసం చరణ్ దాదాపు 4 ఏళ్ళ పాటు కష్టపడ్డాడు. అయినా అభిమానులను సంతృప్తి పరచడం కుదర్లేదు. అందుకే వీలైనంత త్వరగా తన నెక్స్ట్ సినిమాని కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
‘మైత్రి’ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ‘దేవర’ (Devara) తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా… ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ ను మరిపించడానికి బుచ్చిబాబు చరణ్ ఫ్యాన్స్ కి ఒక గిఫ్ట్ ఇచ్చి వారిలో నూతన ఉత్సాహం నింపాలని భావిస్తున్నాడట. అందుకే రాంచరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక మేకింగ్ వీడియోను వదలబోతున్నాడు అని సమాచారం.
మార్చి 27న రాంచరణ్ పుట్టినరోజు ఉంది. కాబట్టి.. ఆ రోజు ఆనవాయితీగా ఒక అప్డేట్ ఇవ్వాలి. అందుకే ఒక మేకింగ్ వీడియోని, అలాగే సినిమాకి సంబంధించి రాంచరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదలబోతున్నాడు బుచ్చిబాబు అని తెలుస్తుంది. ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. మునుపెన్నడూ లేని విధంగా రాంచరణ్ కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. మరో వారంలో దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది.