ఇటీవల ఎన్టీఆర్ (Jr NTR) లుక్ విషయంలో చాలా చర్చలు నడుస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ మరింత సన్నబడ్డాడు. ‘వార్ 2’ (War 2) సినిమా కోసం ఎన్టీఆర్ ఇలా సన్నబడ్డాడు అని అతని అభిమానులు అనుకుంటున్న టైంలో… అతని డూప్ ఈశ్వర్ హరీష్ మాత్రం ‘ఎన్టీఆర్ కి ఒంట్లో బాలేదు, చాలా వీక్ గా ఉంటున్నారు. అతని జెప్టో యాడ్ లో కూడా నటించింది నేనే’ అంటూ తెలిపి పెద్ద షాకిచ్చాడు. దీంతో అభిమానుల్లో కొంత కలవరం కూడా ఏర్పడింది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ డూప్ ఈశ్వర్ ను అభిమానులు తెగ తిట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కు సంబంధించిన మరికొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇవి అభిమానులకు మరింత షాకిచ్చే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. విషయం ఏంటంటే.. ఇటీవల ఎన్టీఆర్.. తన నెక్స్ట్ సినిమా అయినటువంటి ‘డ్రాగన్’ షూటింగ్లో జాయిన్ అయ్యాడు.ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఆ టైంలో తీసిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అవి చర్చనీయాంశం అయ్యాయి.
తాజాగా ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ లో తీసిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ మోహంలో మునుపటి గ్లో లేదు. చాలా పీక్కుపోయిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మళ్ళీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఎన్టీఆర్ కు ఏమైంది? వరుసగా పెద్ద ప్రాజెక్టులు చేయడం వల్ల ఎన్టీఆర్ పై ఒత్తిడి పడిందా? ముఖ్యంగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఒత్తిడి పెడుతున్నాడా? అంటూ నానా విధాలుగా చర్చించుకుంటున్నారు. మరి అసలు విషయం ఏంటో.. ఎన్టీఆర్ టీంకే తెలియాలి.