ఒకప్పటి స్టార్ హీరోయిన్.. షాకింగ్ కామెంట్స్ వైరల్!

హీరోయిన్ కిరణ్ రాథోడ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కు ఈమె కజిన్. కరెక్ట్ గా చూస్తే కిరణ్ రాథోడ్ లో కూడా రవీనా పోలికలు కనిపిస్తాయి. 2002లో విక్రమ్ హీరోగా నటించిన ‘జెమినీ’ చిత్రంతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘నువ్వులేక నేనులేను’ సినిమాతో ఈమె ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత విలన్, అన్బే శివం, విన్నర్, తెన్నవన్, ఆంబళ్ వంటి తమిళ సినిమాల్లో నటించింది.

కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది.అయితే రజినీకాంత్ ‘బాబా’ సినిమాలో ఈమెకి ఛాన్స్ వస్తే కొన్ని కారణాల వల్ల వదులుకుంది. ఆ విషయాన్ని తలుచుకుని ఆమె ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది. మధ్యలో సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లియో’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఇది పక్కన పెడితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ.. “గతంలో నేను ఓ వ్యక్తిని ప్రేమించాను. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే! ఆ పొరపాటు చేయకపోయుంటే ఇప్పుడు నా కెరీర్ మరోలా ఉండేది. సినిమా ఇండస్ట్రీకి నేను దూరమయ్యేదాన్ని కాదు. కొంతమంది వ్యక్తులు కావాలని నన్ను సినిమా రంగానికి దూరం చేశారు. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉన్నాను. కానీ నేను బికినీ ఫోటోలు షేర్ చేస్తుంటే నీ రేటు ఎంత? అని అడుగుతున్నారు. ఆ మాటలు వింటుంటే బాధేస్తుంది. ప్రస్తుతం నేను లియో సినిమాలో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది (Kiran Rathod )కిరణ్ రాథోడ్.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus