సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’. 2014 లో తమిళంలో వచ్చిన ‘వీరమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్, భూమిక, జగపతి బాబు, భాగ్యశ్రీ వంటి వారు కీలక పాత్రలో నటించారు. ఓ పాటలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ కూడా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. చరణ్ స్టెప్పులేసిన పాటకు సంబంధించిన క్లిప్ దేశమంతా వైరల్ అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పై కొంత వరకు అంచనాలు ఏర్పడడానికి కూడా అదే కారణమని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ‘బతుకమ్మ’ పై పాట ఉండటం కూడా ఓ విశేషంగా చెప్పుకోవాలి. ఫర్హద్ సామ్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ బ్యానర్ పై స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మించడం విశేషం. రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
ఇక ఫేక్ రివ్యూయర్ గా పేరొందిన ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు.. ‘కిసీ క బాయ్ కిసీ క జాన్’ చిత్రాన్ని వీక్షించినట్టు తెలిపి.. ఈ చిత్రానికి రివ్యూ ఇచ్చాడు. అతని అభిప్రాయం ప్రకారం.. ‘ఇది ఒక సెన్స్ లెస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రమట. ‘ఇలాంటి బోరింగ్ సినిమాని సల్మాన్ ఖాన్ తన భుజాలపై మోసి గట్టెక్కించ్చే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్లే మరియు కథ వాంతి తెప్పించేలా ఉంది. పాటలు కూడా చాలా వరస్ట్.
పూజా హెగ్డే పాత్ర కూడా ఇరిటేట్ చేసే విధంగా ఉంది’ అంటూ ఇతను పేర్కొన్నాడు. అలాగే 2/5 రేటింగ్ ఇచ్చి సినిమా పై నెగిటివిటీ పెంచే ప్రయత్నం చేశాడు ఉమైర్ సంధు. ఇక ఇతని రివ్యూ పై సోషల్ మీడియాలో భయంకరమైన సెటైర్లు పడుతున్నాయి. అయినా అతనికి ఇదేమి కొత్త కాదు. ఒకప్పుడు అన్ని సినిమాలకు పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చేవాడు. దీంతో జనాలు ఇతన్ని పట్టించుకోవడం లేదని భావించి.. తనకి నచ్చని సినిమాల నెగిటివ్ గా రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు.
A Senseless Family Entertainment. #KKBKKJ is a Boring Family saga which capitalises on the star power of Salman Khan.Screenplay & Story is totally Vomiting ! Songs are even Worst. #PoojaHegde is irritating.