Chiranjeevi: కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్ పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన మెగాస్టార్ చిరంజీవి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా మెగా అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు.ఇక ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

అభిమానులు చిరంజీవి నటించిన పలు సినిమాలలో ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. గుడివాడలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈయన పాల్గొన్నారు. గుడివాడలోని చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా కొడాలి నాని పాల్గొనడమే కాకుండా స్వయంగా కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలో భాగంగా తోట సాయి సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయి నటుడిగా నిలిచిపోయే వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన నుండి నూరేళ్లు ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా ఈయన కోరుకున్నారు. ఇకపోతే కొడాలి నానికు కూడా ఇండస్ట్రీతో ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈయన కూడా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus