Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం పై వైసీపీ ఎం.ఎల్.ఎ కొడాలి నాని షాకింగ్ కామెంట్స్!

ఈరోజు దివంగత స్టార్ హీరో, మాజీ ముఖ్యమంత్రి.. అయిన నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి బాలయ్య వెళ్లడం జరిగింది. అయితే తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు ఉండటం చూసి..మండిపడి తీయించేశారు. ఇది కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంలో బాలయ్యని ట్రోల్ చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారో, ఎన్టీఆర్ పై సింపతీ కురిపించేవారు కూడా అంతే మంది ఉన్నారు.

ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ముందు ఇలాంటివి అన్నీ చిన్న విషయాలే. అయినా సరే ఎందుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానుల పై మండిపడుతూ మాటల యుద్ధానికి దిగారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ విషయాన్ని తమ పార్టీకి అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేశారు. కొడాలి నాని మాట్లాడుతూ.. “జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయడం వల్ల..

అతని వెంట్రుక ఏమైనా ఉడిందా? వాళ్ళ బుద్ధి ఎలాంటిదో బయటపడింది. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వంటి వాళ్ళు వంద మంది వచ్చినా ఎన్టీఆర్ ని ఏమీ పీకలేరు” అంటూ ఘాటు కామెంట్లు చేశారు. ఇక కొడాలి నాని- ఎన్టీఆర్..లు మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.

కొడాలి నానికి 2009 లో ఎం.ఎల్.ఎ టికెట్ ఇప్పించిందే (Jr NTR) ఎన్టీఆర్..! అయితే తర్వాత అతను వైసీపీ పార్టీకి మారడం వల్ల .. జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీ నుండి మాటొచ్చింది. అలా బాలయ్య , ఎన్టీఆర్..ల మధ్య దూరం కూడా పెరిగినట్టు అయ్యింది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus