తెలుగు వెండితెరపై విటలా చార్య తర్వాత అద్భుతాలు చేసిన డైరక్టర్ కోడి రామకృష్ణ. అమ్మోరు, దేవి సినిమాలతో గ్రాఫిక్స్ రుచిని పరిచయం చేసారు. అంజి సినిమాలో లేని ప్రపంచాన్ని కళ్లకు చూపించారు. కథ బలానికి సరైన గ్రాఫిక్స్ మేళవించి అరుంధతి అనే అద్భుత కళా ఖండాన్నీ తెరకెక్కించారు. ఇప్పుడు మరో అపూర్వ సృష్టి కోసం కష్టపడుతున్నారు.
గతంలో కన్నడ నటుడు విష్ణు వర్ధన్ కథానాయకుడిగా “నాగ రాహువు” అనే సినిమా వచ్చింది. అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. విష్ణు వర్ధన్ కన్నడలో పెద్ద స్టార్ గా ఎదిగి .. చనిపోయారు. “నాగ రాహువు” కథ నచ్చడంతో ప్రస్తుతం కోడి రామకృష్ణ ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అయితే ఇందులో కూడా విష్ణు వర్ధన్ నే హీరోగా కనిపిస్తున్నాడు. అదెలా సాధ్యం ? ఎప్పుడో మరణించిన వ్యక్తి ఇప్పుడు ఎలా హీరో గా నటిస్తున్నాడు ? అనే డౌట్ వస్తుంది కదూ..! అదే కోడి రామకృష్ణ ప్రతిభ. అతని గ్రాఫిక్స్ ఉపయోగించి పూర్తి సినిమాను చిత్రీకరించారు. ఇందుకోసం గ్రాఫిక్స్ నిపుణులు వందమందికి పైగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు హీరో చుట్టూ గ్రాఫిక్స్ చూసాం. ఈ సినిమాతో గ్రాఫిక్స్ హీరో చుట్టూ కథని చూ డనున్నాం. ఈ సినిమా జూలైలో కన్నడ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.