కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మే 13నే ‘ఆచార్య’ రిలీజ్ అయ్యి ఉండేది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మళ్ళీ ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..’ఆచార్య’ కు తప్ప కొరటాల శివ తెరకెక్కించిన సినిమాలన్నిటికీ దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందించాడు.వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.
అయితే గత ఏడాది అతను ఫామ్ లో లేకపోవడంతో మెగాస్టార్ ఒత్తిడి మేరకు ‘ఆచార్య’ కు మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు కొరటాల. అయితే దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు నాడు కొరటాల.. ‘ఈ ఒక్క సినిమాకే మనం దూరంగా ఉన్నాము. తర్వాత మన జర్నీ కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కొరటాల ఆ మాట తప్పుతున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ‘ఆచార్య’ తర్వాత ‘ఎన్టీఆర్ 30’ ని కొరటాల డైరెక్ట్ చేయనున్నాడు.
పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను తీసుకోబోతున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ ఆఫర్ కు అనిరుధ్ కూడా సంతోషంగా ఒప్పుకున్నట్టు స్పష్టమవుతుంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. అనిరుధ్ ఫిక్స్ అని సర్వత్రా ప్రచారం జరుగుతుంది. కాబట్టి కొరటాల పూర్తిగా దేవికి హ్యాండ్ ఇచ్చేసినట్టే అని చెప్పాలి.