తెలుగు చిత్ర పరిశ్రమపై ఒక అపవాదు ఉంది. ఇక్కడ హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ డాల్ గానే ఉపయోగించుకుంటారని విమర్శ ఉంది. అందులో నిజం లేకపోలేదు. ఎక్కువశాతం హీరోయిన్స్ హీరోతో స్టెప్పులు వేయడానికే ఉంటారు. కథలో వారి ప్రాధాన్యత తక్కువ. కొరటాల శివ కూడా ఆ తప్పుని చేస్తున్నట్లు తెలిసింది. తాను మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న “భరత్ అనే నేను” సినిమా ఫస్ట్ ఓత్ గణతంత్ర దినోత్సవం నాడు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. సీఎం గా మహేష్ లుక్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. నిన్నటి వరకు రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ సీన్ చిత్రీకరించిన కొరటాల.. ఈ నెలాఖరులో మహేష్, కైరా అద్వానీలపై రొమాంటిక్ సాంగ్ తీయనున్నారు.
అయితే కైరా ని ఈ సినిమాలో కేవలం పాటలకు, కొని సీన్లకే పరిమితం చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మహేష్ హీరోయిజాన్ని పెంచేందుకే హీరోయిన్ కి బలమైన సన్నివేశాలు లేకుండా పోయాయని తెలిసింది. కోట్లు ఇచ్చి వారిని అందాల బొమ్మలుగా మాత్రమే చూపించడం మంచిది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 26 న రిలీజ్ కానుంది.