డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ కొంతమంది సినీ తారల పేర్లు బయటపెట్టడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. అతడితో సంబంధమున్న అందరిని పోలీసులు విచారిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో మొదటగా పూరీ జగన్నాథ్ ని విచారించిన సిట్ బృందం వరుసగా రోజుకొకరు చొప్పున తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు, చార్మీ, ముమైత్ ఖాన్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, రవితేజలను ప్రశ్నించింది. ఈ రోజు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు సిట్ ముందు హాజరయ్యారు. ఈ డ్రగ్స్ కేసులో సినిమా వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో వారు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు.
తాజాగా డైరక్టర్ కొరటాల శివ సంచలన కామెంట్స్ చేశారు. “డ్రగ్స్ ని అరికట్టడానికి సిట్ చేస్తున్న కృషి అభినందనీయమే.. కానీ డ్రగ్స్ కంటే సమాజానికి అత్యంత ప్రమాదకరమైనది. డ్రగ్స్ కన్నా దాని వల్లే సమాజానికి ఎక్కువ చెడు జరుగుతోంది. ప్రభుత్వాలు తలచుకుంటే ఈ పని చేయగలుగుతాయి” అని ట్వీట్ చేశారు. కొరటాల ట్వీట్ కి అందరూ లైక్ చేస్తున్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.