‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు.. తనతో పనిచేసిన ప్రతీ హీరోకి అప్పటి వరకూ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలను అందించాడు. ఇక ఇప్పుడు వైరస్ మహమ్మారి కారణంగా.. సినీ ఇండస్ట్రీ కొన్ని వందల కోట్లు నష్టపోయింది. షూటింగ్ లు మధ్యలో ఆగిపోవడం.. వాటి కోసం నిర్మాతలు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ లు పే చెయ్యడం వంటి వాటి రూపంలో కోట్లకు కోట్లు నష్టమొచ్చిందట.
ఇప్పుడు షూటింగ్ లను తిరిగి ప్రారంభించినా.. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. కాబట్టి సినిమా హీరో, హీరోయిన్, దర్శకులు పారితోషికాల్లో కోతలు విదిస్తే తప్ప.. వారు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో స్టార్ హీరోలు మాత్రం ఈ విషయం పై స్పందించడం లేదు. దర్శకులు కూడా అస్సలు నోరుమెదపడం లేదు అనుకున్న తరుణంలో కొరటాల శివ ముందుకొచ్చాడు. ఇప్పుడు కొరటాల పనిచేస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి పారితోషికం తగ్గించుకుంటాను అని తానే ముందుకొచ్చాడట.
నిర్మాతలు కొరటాలను అడగకపోయినా తనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కొరటాల తీసుకున్న నిర్ణయం మిగిలిన స్టార్ డైరెక్టర్లకు తల నొప్పి తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఒక్క రాజమౌళిని పక్కన పెడితే.. మిగిలిన స్టార్ డైరెక్టర్లు అందరినీ పారితోషికం తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారట. అందుకు కొరటాలను ఉదాహరణగా చూపిస్తున్నారట. మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.