టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు టాలీవుడ్ హీరోలపై వేసిన సెటైర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో జనరేష్ మారుతోంది కానీ హీరోల్లో మార్పు మాత్రం రావడం లేదన్నారు. ఇప్పుడున్న హీరోలకు సాధన తక్కువైంది.. వాదన ఎక్కువైందని అన్నారు. హీరోలకు జ్ఞమా పెరగాలి.. కానీ విజ్ఞానాన్ని పెంచుకుంటూ.. జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. మైక్ పట్టుకుంటే ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడడం లేదని..
గౌరవ, మర్యాదలు ఇవ్వడం తగ్గించేశారని అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ వేసుకునే బట్టల్లో మార్పొచ్చింది కానీ జ్ఞానం మాత్రం పెరగలేదని అన్నారు. డబ్బులున్న ప్రతి ఒక్కడూ హీరో అయిపోతున్నాడని.. నటించాలనే కసి మాత్రం ఉండడం లేదని అన్నారు. ఇదే క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై కూడా స్పందించారు. అసోసియేహం గొడవలు చాలా కాలంగా జరుగుతున్నాయని.. గతంలో తను ట్రెజరర్ గా పని చేసినప్పుడు కూడా గొడవలు జరిగాయని..
అప్పుడే నమస్కారం పెట్టి ఆ పోస్ట్ నుండి తప్పుకున్నట్లు చెప్పారు. ‘మాలో గొడవలు ఎప్పుడూ ఉంటాయని. అంతమాత్రానికి మీడియా ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి టీవీలో మాట్లాడితే.. అసోసియేషన్ లో కష్ఠాలను టీవీలు తీరుస్తాయా అంటూ ప్రశ్నించారు.