Kota Srinivasa Rao, Nagababu: నాగబాబుపై కోటా షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు పై కొన్నిరోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. నాగబాబు కోట శ్రీనివాసరావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే నాగబాబు చేసిన కామెంట్ల గురించి తాజాగా కోట శ్రీనివాసరావు స్పందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు ఎవరంటూ కోట శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రకాష్ రాజ్, తాను కలిసి 15 సినిమాలు చేశామని ప్రకాష్ రాజ్ సమయానికి షూటింగ్ కు హాజరు కాకుండా ఇబ్బంది పెట్టేవారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. గతంలో నాగబాబు ప్రకాష్ రాజ్ ను తిట్టారని నాగబాబును తాను ఏమైనా అన్నానా? అంటూ కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు. తాను నాగబాబులా కామెంట్లు చేసి ఉంటే టీవీలలో డిబేట్లు పెట్టేవారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. కోట శ్రీనివాసరావు కామెంట్ల గురించి నాగబాబు స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

కోట శ్రీనివాసరావు అనసూయ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా కోట శ్రీనివాసరావు పేరును ప్రస్తావించకుండా అనసూయ ఘాటుగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల వల్ల ఒక వర్గం కొంతమంది నటులపై అనధికారికంగా బ్యాన్ విధించిందని తెలుస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు ఈ వివాదాలకు దూరంగా ఉండటం గమనార్హం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేయగా విష్ణు ఆ రాజీనామాను ఆమోదించనని చెబుతున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.