టాలీవుడ్ ఇండస్ట్రీలో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి కోటా శ్రీనివాసరావు నటుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. సెప్టెంబర్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనుండగా ప్రకాష్ రాజ్ కు కొంతమంది సీనియర్ నటులు సపోర్ట్ చేస్తూ ప్యానల్ ను ప్రకటించటాన్ని కోటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో మాట్లాడుతూ తాను ముఖ్యంగా రెండు విషయాలు అడగదలుచుకున్నానని కోటా శ్రీనివాసరావు చెప్పారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను ఎవరు అనౌన్స్ చేశారో చెప్పాలని ఇప్పుడున్న కమిటీ ఏమైనా అనౌన్స్ చేసిందా..? అని కోటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ మంచి నటుడు కావచ్చని ఎన్నికల టైమ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడితే బాగుంటుందని కోటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. చిరంజీవి ప్రకాష్ రాజ్ కు మద్ధతిచ్చారో లేదో తనకు తెలియదని నాగబాబు ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని కోటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అంటూ ఎందుకు గోల చేస్తున్నారు అనేదే తన బాధ అని కోటా శ్రీనివాసరావు తెలిపారు. సాయికుమార్ బీజేపీ తరపున పోటీ చేసిన వ్యక్తి అని ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేకి అని ఆయన ఈయనకు ఎలా సపోర్ట్ చేస్తారని కోటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. నేను బీజేపీ పార్టీలో కొనసాగుతున్నాను కాబట్టే ఈ ప్రశ్నలు అడుగుతున్నానని కోటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. కోటా శ్రీనివాసరావు ప్రశ్నల గురించి ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.