‘క్రాక్’ 13 డేస్ కలెక్షన్స్..!

గతేడాది ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లానే ఈ ఏడాది మాస్ మహా రాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం కూడా వీక్ డేస్ లోనూ మంచి కలెక్షన్లను నమోదుచేస్తుండం విశేషం. 13 వ రోజున కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 0.68 కోట్ల షేర్ ను రాబట్టి సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. 3 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్ ‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ -గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేశారు.

ఇక ‘క్రాక్’ చిత్రం 13 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  9.46 cr
సీడెడ్  5.14 cr
ఉత్తరాంధ్ర  3.55 cr
ఈస్ట్  2.78 cr
వెస్ట్  2.09 cr
కృష్ణా  1.95 cr
గుంటూరు  2.30 cr
నెల్లూరు  1.51 cr
ఏపీ+తెలంగాణ టోటల్  28.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  1.35 cr
ఓవర్సీస్  0.70 cr
టోటల్ వరల్డ్ వైడ్ :  30.83 cr

‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 13 రోజులకు గాను ఈ చిత్రం 30.83 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం మరో విశేషం!ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 12కోట్ల పైనే లాభాలను దక్కించుకున్నారు.

Click Here To Read Movie Review

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus