సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ‘క్రాక్’ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ‘క్రాక్’ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ‘ఆహా’ యాప్.. రిపబ్లిక్ డే కానుకగా సినిమాను ప్రసారం చేయాలని చూస్తుంది. ఇప్పటివరకు ‘ఆహా’ చేసిన అన్నింటిలో ‘క్రాక్’ సినిమానే పెద్ద డీల్.
దాదాపు 10 కోట్ల రూపాయలకు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది ‘ఆహా’. అయితే ఠాగూర్ మధుకు ఈ మొత్తం డబ్బుని ఇవ్వలేదట. రకరకాల ఆబ్లిగేషన్లు, మరికొన్ని ప్రాజెక్ట్ లను లింక్ పెట్టి.. ‘క్రాక్’ సినిమా డీల్ ను లాక్ చేశారట అల్లు అరవింద్. అంతేకాకుండా.. థియేటర్లోకి వచ్చిన మూడు వారాలకే ఓటీటీలో సినిమా పెట్టుకునేలా అగ్రిమెంట్ ఫిక్స్ చేసుకున్నారట. ఇందులో భాగంగా ‘క్రాక్’ సినిమాను వీలైనంత త్వరగా స్ట్రీమింగ్ కు తీసుకురావాలని భావిస్తున్నారు అల్లు అరవింద్.
జనవరి 26న ‘క్రాక్’ను ఆహాలో పెట్టాలనేది ఒక ఆలోచన. అలానే వీకెండ్ తో పాటు వాలెంటైన్స్ డే కలిసొచ్చేలా.. ఫిబ్రవరి 12వ తేదీన స్ట్రీమింగ్ చేస్తే ఎలా ఉంటుందనేది మరో ఆలోచన. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ నెలలోనే స్ట్రీమింగ్ కి తీసుకొస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. మరి ఈ విషయంలో అల్లు అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!