సంక్రాంతి సంరంభం ఇవాళ “క్రాక్”తో మొదలవ్వాల్సి ఉంది. రవితేజ-గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా ఇది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తమిళనాడు మరియు ఆంధ్ర ప్రాంతాల్లో దాదాపు 25 కోట్ల మేర ఫైనాన్షియల్ ఇష్యుస్ క్లియర్ చేయనందుకు మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేశారు. హైద్రాబాద్ లోని 8.45 షో ఆల్రెడీ క్యాన్సిల్ అవ్వగా.. 9 గంటల షోలు కూడా పలు చోట్ల క్యాన్సిల్ అవుతున్నాయి.
నిర్మాత బి,మధు గత కొన్ని రోజులుగా డిస్ట్రిబ్యూటర్లకు అందుబాటులో లేరని, ఫైనాన్షియర్లు ఆయన్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తుండగా ఆయన స్పందించకపోవడం అటుంచి, తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిసింది. ఆల్రెడీ వీక్ టాక్ ఉన్న “క్రాక్” చిత్రం మార్నింగ్ షోస్ ఇలా క్యాన్సిల్ అవ్వడం, విడుదలకు అడ్డంకులు ఎదురవ్వడం అనేది ఇంకాస్త మైనస్ గా మారింది. ఏదేమైనా సంక్రాంతి ఓపెనర్ అయిన “క్రాక్” ఇలా రిలీజ్ కి ఇబ్బందులుపడడం మంచి శకునం కాదు. నిజానికి ఈ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేద్దామనుకున్నారు.
కానీ.. ఉన్నట్లుండి జనవరి 9కి మార్చారు. విడుదలను ప్రీపోన్ చేయడంతో అందరూ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందేమో అనుకున్నారు. దానికి తోడు ట్రైలర్ ఓ మోస్తరుగా, పాటలు విశేషంగా ఆకట్టుకొని ఉండడంతో మునుపటి రవితేజ చిత్రాలకంటే మంచి అంచనాలు ఈ సినిమా మీద ఉన్నాయి ఆడియన్స్ కి. మరి ఈ రిలీజ్ వల్ల ఆడియన్స్ వెనక్కు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటినీ కంటెంట్ తో అధిగమించి రవితేజ హిట్ కొడతాడో లేదో అనేది మ్యాట్నీ షోకి తెలిసిపోతుంది.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!