Mahesh Babu, Krishna: అలాంటి రోల్స్ కు మహేష్ దూరంగా ఉంటారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. సాధారణ కథలతో తెరకెక్కిన సినిమాలతో మహేష్ బాబు అసాధారణ విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం. ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో మహేష్ బాబు కమర్షియల్ విజయాలను ఖాతాలో వేసుకోవడంతో పాటు తన మార్కెట్ ను పెంచుకున్నారు. అయితే మహేష్ బాబు ప్రతి సినిమాలో ఒకే లుక్ లో కనిపిస్తారని కొంతమంది కామెంట్లు చేస్తారు.

పూర్తిస్థాయిలో ప్రయోగాత్మక పాత్రలకు కూడా మహేష్ బాబు కొంత దూరంగా ఉంటారని చాలామంది భావిస్తారు. తాజాగా ప్రముఖ నటుడు, మహేష్ బాబు తండ్రి కృష్ణ సర్కారు వారి పాట సినిమా గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్కారు వారి పాట సినిమా చూసిన వెంటనే సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశావని మహేష్ బాబుకు చెప్పానని కృష్ణ అన్నారు. పోకిరి, దూకుడు కంటే సర్కారు వారి పాట పెద్ద హిట్ అవుతుందని చెప్పానని కృష్ణ తెలిపారు.

ఈ సినిమా విషయంలో అదే విధంగా జరగడంతో సంతోషంగా ఉన్నానని కృష్ణ కామెంట్లు చేశారు. మహేష్ సర్కారు వారి పాట సినిమాలో పోకిరి కంటే వయస్సు తక్కువగా కనిపించాడని కృష్ణ అన్నారు. షూటింగ్ లు లేకపోతే మహేష్ జిమ్ లోనే ఎక్కువగా ఉంటాడని కృష్ణ కామెంట్లు చేశారు. మహేష్ అల్లూరి సీతారామరాజు పాత్రను కచ్చితంగా చేయడని కృష్ణ వెల్లడించగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మహేష్ అలాంటి పాత్రలకు దూరంగా ఉంటాడని కృష్ణ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో అల్లూరి సీతారామరాజు రీమేక్ లో మహేష్ నటిస్తే బాగుంటుందని భావించిన అభిమానులు కృష్ణ సమాధానంతో ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధిస్తోంది. ఎఫ్3 సినిమా విడుదలయ్యే వరకు సర్కారు వారి పాట సినిమాకు పోటీనిచ్చే మూవీ అయితే లేదు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus