‘ఉప్పెన’ చిత్రం ఇప్పుడు రికార్డు వసూళ్ళు నమోదు చేస్తుందన్నా..రిపీటెడ్ ఆడియెన్స్.. అది కూడా కుర్రకారు మళ్ళీ మళ్ళీ ఈ చిత్రాన్ని చూస్తున్నారన్నా… అందుకు ప్రధాన కారణం కృతి శెట్టి అనే చెప్పాలి. ఈమె ను చూసే లిరిసిస్ట్ శ్రీమణి ‘నీ కన్ను నీలి సముద్రం’ అంటూ పదాలు సమకూర్చి ఉంటాడు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ‘ఉప్పెన’ లో ఫస్ట్ హైలెట్ చెప్పమని ఏ ప్రేక్షకుడిని అడిగినా..తడుముకోకుండా కృతి శెట్టి పేరే చెబుతుంటాడు.
అందుకే ఇప్పుడు ఈ అమ్మడి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నాని,సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి.. ఆ తరువాత రామ్,సూర్య,నాగ చైతన్య వంటి హీరోలతో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అందుకు గాను ఈమె రూ.60లక్షల పారితోషికాన్ని డిమాండ్ చెయ్యగా.. అందుకు దర్శకనిర్మాతలు కూడా ఓకే చెప్పేస్తున్నారట. రానున్న రోజుల్లో ఆ అంకె కోటి రూపాయలు పలికినా ఆశ్చర్యపడనవసరం లేదు. సరే ఇంతకీ కృతి శెట్టి.. ‘ఉప్పెన’ చిత్రానికి ఎంత తీసుకుంది అనే డౌట్ చాలా మందిలో ఉంది.
అందుతోన్న సమాచారం ప్రకారం ‘ఉప్పెన’ చిత్రానికి గాను కృతిశెట్టి రూ.6లక్షల పారితోషికం అందుకుందట. ఈమెకు తెలుగు నేర్పించడానికి నిర్మాత సుకుమార్.. నెలకు రూ.5 వేలు ఇచ్చి ఓ టీచర్ ను కూడా పెట్టాడట. అతను కూడా ఒకప్పుడు సుకుమార్ స్టూడెంటే అని టాక్. సరే ఇక ఇప్పుడు కృతి శెట్టి పారితోషికం రూ.60 లక్షలకు ఎగబాకింది.అంటే 10 రెట్లు పెరిగిందన్న మాట.