సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే రజనీకాంత్ నటించిన కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రజనీకాంత్ కేఎస్ రవికుమార్ (K. S. Ravikumar) కాంబోలో తెరకెక్కిన లింగ (Lingaa) మూవీ భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైనా ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది. అయితే లింగ సినిమా ఫ్లాప్ కావడానికి రజనీకాంత్ కారణమని కేఎస్ రవికుమార్ పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.
ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారని ఆయన తెలిపారు. లింగ మూవీ కంప్యూటర్ గ్రాఫిక్స్ కు నాకు ఏ మాత్రం సమయం ఇవ్వలేదని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు. లింగ సెకండాఫ్ మొత్తాన్ని రజనీకాంత్ మార్చేశారని ఆయన కామెంట్లు చేశారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, అనుష్కతో (Anushka Shetty) సాంగ్ ను ఆయన తొలగించారని కేఎస్ రవికుమార్ (KS Ravikumar) పేర్కొన్నారు. రజనీకాంత్ కృత్తిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ ను యాడ్ చేశారని లింగ సినిమాను గందరగోళం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
2014లో విడుదలైన లింగ అప్పట్లో 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. రజనీకాంత్ ఫ్యాన్స్ ను ఈ సినిమా నిరాశకు గురి చేసింది. రజనీకాంత్ కేఎస్ రవికుమార్ (KS Ravikumar) కాంబోలో తెరకెక్కిన ముత్తు (Muthu) , నరసింహ (Narasimha) సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. రజనీకాంత్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
మరికొన్ని రోజుల్లో వేట్టయన్ (Vettaiyan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏషియన్ సురేష్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. వేట్టయన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.