Kushi: ‘ఖుషి’.. ట్రైలర్ పైనే అందరి దృష్టి..!

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ‘ఖుషి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల డోస్ పెంచాలని చిత్రబృందం భావిస్తుంది.

ఈ సందర్భంగా ట్రైలర్ ను ఆగస్టు 9 న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ట్రైలర్ (Kushi) ‘ఖుషి’ సినిమాకి సంబంధించి చాలా లెక్కలు తేల్చాల్సి ఉంది. అంటే ట్రైలర్ వ్యూస్, లైక్స్ వంటి వాటి గురించి కాదు చెప్పేది.థియేట్రికల్ బిజినెస్ లెక్కల గురించి అనమాట. నిర్మాతలైన ‘మైత్రి’ వారు ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ మార్కెట్ కి తగ్గట్టు కొన్ని ఏరియాల్లో భారీగానే కోట్ చేశారు. కానీ విజయ్ దేవరకొండ గత సినిమాలు నిరాశపరిచాయి.

అలాగే సమంత నటించిన ‘శాకుంతలం’ కూడా సరిగ్గా ఆడలేదు.ఇక దర్శకుడు శివ నిర్వాణ గత చిత్రం ‘టక్ జగదీష్’ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి… నిర్మాతలు చెప్పిన భారీ రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ జంకినట్టు తెలుస్తుంది. అందుకే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తే.. ఇక డౌట్ లేకుండా నిర్మాతలు కోట్ చేసిన రేట్లకే ‘ఖుషి’ హక్కులను తీసుకుంటారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags